టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికీ తాను కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసిన సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా దాదాపు సినిమాలకు ఏడాది గ్యాప్ ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఆ సంగతి పక్కన పెడితే సమంత ఇప్పుడు అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే మయోసైటిస్ వ్యాధి( Myositis disease ) బారిన పడినట్లు సమంత ప్రకటించిన సమయంలో ఆమె పరిస్థితి తెలుసుకొని అభిమానులు చాలా భయపడ్డారు.
ఆమె సినిమాలకు గ్యాప్ ఇస్తుంది అని చెప్పడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందేమో అందుకే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అని అనుకున్నారు అభిమానులు.కానీ సమంత మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది.చికిత్స కోసం అమెరికాకి వెళ్తుందనుకున్న సమంత నేరుగా అక్కడికి వెళ్లలేదు.యూఎస్ ( US ) వెళ్లడానికి ముందు ధ్యానం, యోగా, స్నేహితులతో డాన్స్‌లు అని సమంత తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేస్తోంది.
ఆయా వీడియోలు, ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.తాజాగా అందమైన స్మిమ్మింగ్ ఫూల్, పూల తోటలు, బంగ్లాలో దిగిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది.
ఇలా రాబోయేదంతా మంచి కాలం అని నమ్మకంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ క్రమంలోనే దటీజ్ సమంత అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే కొందరు ఆ ఫోటోలపై స్పందిస్తూ సమంతా తనకు వ్యాధి వచ్చింది అని కుంగిపోకుండా భయపడకుండా ధైర్యంగా నిలబడుతూ చిరునవ్వుతో ఆ వ్యాధిని ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం సమంతని టార్గెట్ చేస్తూ ఆమెకు ఉన్న వ్యాధి అంత పెద్దది ఏమి కాదు.
అందుకే ఆమె ఎంజాయ్ చేస్తోంది అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.