వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో పర్యటిస్తున్నారు.
అక్కడి వరద బాధితులను సీఎం జగన్ పరామర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే మునకకు గురైన గ్రామాల్లో సాయం అందిందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామాల్లో సహాయ కార్యక్రమాలను పరిశీలించినట్లు తెలిపారు.పేదలకు కలిగిన నష్టం చిన్నదైన సరే ప్రభుత్వం ఆదుకోవాలన్న సీఎం జగన్ బాధితులకు రూ.10 వేల సాయం అందించాలని అధికారులకు సూచించారు.వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు.
హెల్త్ క్యాంపులు సైతం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు.పంట నష్టంపై బాధితుల లిస్ట్ ను రెండు రోజుల్లో రూపొందిస్తామని కలెక్టర్ చెప్పారని సీఎం జగన్ తెలిపారు.
ఈ సీజన్ లో జరిగిన పంట నష్టానికి తగిన పరిహారం సీజన్ పూర్తయ్యే సమయం కల్లా ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.