మనలో చాలామందిపై సినిమాల ప్రభావం ఉంటుందనే సంగతి తెలిసిందే.సినిమాలలోని డైలాగ్స్ ను ఎక్కువమంది ఇష్టపడతారు.
అయితే తెలుగులోని కొన్ని సినిమాలలో దేశభక్తిని చాటిచెప్పే అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి.ఈ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుకుంటాయని చెప్పవచ్చు.“ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడై విజృంభించి బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు.
సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం” అనే డైలాగ్ అల్లూరి సీతారామరాజు( Alluri Sitaramaraju ) మూవీకి హైలెట్ గా నిలిచింది.

మేజర్ చంద్రకాంత్( Major Chandrakanth ) సినిమాలో “దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా.అపాయం అంటే భయపడేవాడికి నాకెందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికుండదురా.ఎందరో ప్రాణాలర్పించారురా నీకోసం నాకోసం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారురా.అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్రాన్ని ఈనాడు స్వాతంత్రం అంటే అర్థం తెలియని స్పెల్లింగ్ తెలియని కొంతమంది ఏలుతున్నారా.” అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

ఖడ్గం( khadgam ) సినిమాలో “శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్లు మా చేతులు కట్టేశారు.ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి.ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది.వందేమాతరం” అంటూ శివాజీరాజా చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.సుభాష్ చంద్రబోస్( Subhash Chandra Bose ) సినిమాలో “బోసుకు చావులేదు.అస్తమించిన సూర్యుడు ఉదయించినట్టే ఈ బోస్ తిరిగొస్తాడు.కింద పడేయటానికి ఇది సామాన్యమైన జెండా కాదు.ఈ దేశంలోని 40 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి ఈ జెండా పట్టుకుని ఊపితే ఆ గాలికే కొట్టుకునిపోయి లండన్ లో పడతారు” అనే డైలాగ్ ఆకట్టుకుంది.
ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లో సైతం దేశభక్తి గొప్పదాన్ని చెప్పే డైలాగ్స్ ఉన్నాయి.







