ఇంతమంది పై వ్యతిరేకతా ? కేసీఆర్ నిర్ణయం ఏంటో ?

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టికెట్ల కేటాయింపు పైనే దృష్టి చారించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కెసిఆర్ బిజెపి,( BJP party )  కాంగ్రెస్ లకు ధీటుగా బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.

 Against These People, What Is Kcr's Decision, Kcr, Telangana Cm, Telangana Elec-TeluguStop.com

దీనిలో భాగంగానే ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసి , ప్రకటించి వారంతా జనాల్లోకి వెళ్లే విధంగా కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అనేక సర్వేలు చేయించారు .సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు,  నియోజకవర్గాల్లో పార్టీల బలం, గెలుపు అవకాశాలు వీటన్నిటి పైన సర్వే చేయిస్తున్నారు.ఇక ఆయా జిల్లాల మంత్రుల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 49 మంది డేంజర్ జోన్ లో ఉన్నారని , వారికి టిక్కెట్ ఇస్తే కచ్చితంగా ఓటమి చెందుతారని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడంతో వారి స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

Telugu Brs Mlas, Congress, Mla Ticket, Telangana Cm, Telangana-Politics

 వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వీలైనంత ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపైన నిఘా పెట్టి వారి పనితీరును అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం బీఆర్ఎస్( BRS party ) పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.సిట్టింగ్ లకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ప్రకటించినప్పటికీ,  వారిలో 49 మంది డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

వారికి టిక్కెట్ ఇస్తే ఈసారి ఓటమి ఖాయం అంటూ తేల్చారట.దీంతో ఆ 49 నియోజకవర్గాల పైన కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యమ్నాయి చర్యలకు దిగారు.

Telugu Brs Mlas, Congress, Mla Ticket, Telangana Cm, Telangana-Politics

 ప్రస్తుతం 49 నియోజకవర్గాల్లో వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి అనే విషయంపై కేసీఆర్( CM KCR ) ఆయా జిల్లాల మంత్రులను ఆరా తీస్తున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకు వెళ్లడం లో విఫలమయ్యారా ? అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారా అనే విషయాల పైన ఆరా తీస్తున్నారు.వీటన్నిటిని బేరీజు వేసుకుని అభ్యర్థులు ఎంపిక చేపట్టి మళ్లీ సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube