ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె అదే కల్కి.ఈ సినిమా టీజర్ తో హాలీవుడ్ సినిమా ఫీల్ తెప్పించిన నాగ్ అశ్విన్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
కల్కి సినిమా బడ్జెట్ 500 కోట్లకు అటు ఇటుగా పెడుతున్నారని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి.2024 మే 9న ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

కల్కి సినిమాతో ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ లో కూడా వ్యాపిస్తుందని చెబుతున్నారు.కల్కి సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.బాహుబలి రెండు పార్ట్ లతోనే 2000 కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు.
కల్కి సినిమా బిజినెస్ విషయంలో కూడా భారీ రెస్పాన్స్ వస్తుందని టాక్.ఈ సినిమాతో ప్రభాస్ సత్తా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది.అయితే కల్కి సినిమా కరెక్ట్ గా కొడితే మాత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రభంజనం సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుందని తెలిసిందే.
సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్స్ కూడా ఉన్నారు.







