టైమ్‌, డెస్టినీ కమెడియన్ సుధాకర్ జీవితాన్ని ఎలా మార్చాయో తెలుసా..?

ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీతెలుగు సినిమాలు ( Zee cinemalu )లో నేను-నాన్న అనే ప్రోగ్రామ్ రీసెంట్‌గా టెలికాస్ట్ చేశారు.నిజానికి ఇది చాలా ఏళ్ల కిందట ప్రసారమైన ఒక ఓల్డ్ ప్రోగ్రామ్‌.

 Comedian Sudhakar Vs Megastar Chiranjeevi , Comedian Sudhakar, Chiranjeevi, Kee-TeluguStop.com

కానీ మళ్ళీ కమెడియన్ సుధాకర్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎపిసోడ్ తాజాగా టెలికాస్ట్ చేశారు.అందులో కమెడియన్ సుధాకర్‌( Comedian sudhakar )ను సన్మానించడం జరిగింది.

అప్పటికే సుధాకర్ చాలా బలహీనంగా తయారై కనిపించారు.నిజానికి ప్రస్తుతం సుధాకర్ వయసు 64.అతనితో పాటే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి వయసు 67.

Telugu Bhola Shankar, Chiranjeevi, Sudhakar, Keerthy Suresh, Tollywood-Movie

అయితే సుధాకర్ నడవడానికే కష్టపడుతున్నారు.చిరంజీవి మాత్రం తమన్నా కీర్తి సురేష్( Keerthy Suresh ) లాంటి హీరోయిన్లతో పోటీగా చలాకీ తనంతో స్టెప్పులు వేసి అదరగొడుతున్నాడు.అనారోగ్యం వల్ల సుధాకర్ అలా అయిపోయాడు ముసలి వాడిగా కూడా మారిపోయాడు.

ఒకవేళ అనారోగ్యమే గనుక అతడిని పట్టిపీడించకపోతే చిరంజీవితో కలిసి హుషారుగా సుధాకర్ నటించేవారు.కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్వించేవారు.

కానీ అతడి కోసం డెస్టినీ దారుణమైన ప్లాన్స్ వేసింది.అలా టైమ్‌, డెస్టినీ ఇద్దరినీ ఎలా ట్రీట్ చేస్తాయో వీరిదే ఉదాహరణగా నిలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం కమెడియన్ సుధాకర్ చనిపోయారని ఫేక్ వార్తలు రాశారు కొందరు.విధి వక్రించి బాధపడుతున్న సమయంలో తనపై ఇలాంటి ఫేక్ వార్తలు రాయడం చాలా బాధాకరమైన సుధాకర్ వాపోయారు.

నేను బతికే ఉన్నానురోయ్ అని ఒక వీడియో రిలీజ్ చేశారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Sudhakar, Keerthy Suresh, Tollywood-Movie

ఇకపోతే సుధాకర్ తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించారు.ఆయన భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జన్మించారు.గుంటూరులోని ఆంధ్ర-క్రైస్తవ కళాశాలలో చదివి, మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.1982లో తెలుగులో తునై సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.తెలుగులో యముడికి మొగుడుతో పాటు పలు సినిమాలు నిర్మించారు.

రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.విచిత్రమైన వాయిస్ మాడ్యులేషన్‌తో, డైలాగ్ డెలివరీతో 1980, 90 లలో టాప్ కమెడియన్‌గా అవతరించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube