డిన్నర్ చేసేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి..!

డిన్నర్( Dinner ) చేసేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నిపుణులు చెప్పిన దాని ప్రకారం నిద్రపోవడానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల ముందే భోజనం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పై( Digestion ) ఒత్తిడి ఉండదు.

 Dont Do These Mistakes While Eating Dinner Details, , Eating Dinner, Dinner Mist-TeluguStop.com

మనం నిద్రలో ఉన్నప్పుడు శరీర జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా స్లోగా అవుతుంది.ఈ క్రమంలో మీరు నిద్రించే సమయానికి కొన్ని నిమిషాల ముందు లేదా గంటలోపు తిన్నారంటే ఆ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.

అలా జీర్ణం కానీ ఆహారంలో శరీరంలో కొవ్వు రూపంలో మిగిలిపోయి మీరు అధిక పరువు పెరిగేలా చేస్తుంది.

అలాగే రాత్రి భోజనంలో వీలైనంత తెలిక పాటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.ఎందుకంటే ఈ తేలికపాటి ఆహారం త్వరగా జీర్ణమై శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది.అంతేకాకుండా ఆహారం ఎక్కువగా తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాక మీరు కచ్చితంగా బరువు పెరిగే అవకాశం( Weight Gain ) ఉంది.

ఇంకా చెప్పాలంటే రాత్రి సమయంలో తీసుకునే భోజనంలో సరిపడినంత పోషకాలు ఉండేలా కచ్చితంగా జాగ్రత్తపడాలి.ఎందుకంటే సంపూర్ణమైన ఆరోగ్యం కోసం కచ్చితంగా పోషకాహారం ఎంతో ముఖ్యం.

అలాగే చాలా మంది రాత్రి పూట భోజనం తర్వాత తీపిని( Sweet ) ఎక్కువగా తింటూ ఉంటారు.ఈ తీపి పదార్థాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల మీరు కచ్చితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.ఇంకా చెప్పాలంటే మీరు తినే ఆహారంలో ఉప్పు( Salt ) కచ్చితంగా పరిమితికి మించి ఉండకూడదు.ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా మీ బీపీ లెవల్స్ లో మార్పులు వచ్చి అవి కచ్చితంగా గుండెపోటుకు దారి తీస్తాయి.కాబట్టి ఎలాంటి రోగాలు రాకుండా ఎప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి.

కాబట్టి కచ్చితంగా పైన తెలిపిన జాగ్రత్తలను పాటించడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube