తెలంగాణలో నేతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇందులో భాగంగా చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3 వేలు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
చేనేత మగ్గం పథకం నేటి నుంచి తెలంగాణలో అమలు చేస్తామన్న మంత్రి కేటీఆర్ చేనేత మిత్ర పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని తెలిపారు.చేనేత హెల్త్ కార్డుల ద్వారా ఓపీ సేవలకు రూ.25 వేలు ఇస్తామని వెల్లడించారు.అదేవిధంగా రూ.40.50 కోట్లతో దాదాపు పదివేలకు పైగా ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.దాంతో పాటు మృతిచెందిన నేత కార్మికుల కుటుంబాలకు టెస్కో సాయం రూ.25 వేలకు పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.







