1.వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో ఊరట

తెలంగాణలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
2.కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు
గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ను అమలు చేయడం ఎంత ముఖ్యమో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోలేక పోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
3.సీఎంఓపై నాదెండ్ల మనోహర్ విమర్శలు

ఏపీ సీఎంవో లో ఒక్కో పనికి ఒక్కో ధర పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
4.ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అగ్నిప్రమాదం జరిగింది.దీంట్లో రోగులను బయటకు తరలించి ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
5.లోక్ సభ లో అడుగుపెట్టిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్ లో అడుగు పెట్టారు.సుప్రీంకోర్టు స్టేటు లోక్సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటరీయెట్ పునరుద్ధరించింది.
6.చంద్రబాబు హెచ్చరిక
పుంగనూరులో టిడిపి కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారని టిడిపి నేత చంద్రబాబు మండిపడ్డారు.మా కార్యకర్తలను హింసిస్తే మూల్యం తప్పదు అంటూ ఆయన హెచ్చరించారు.
7.తెనాలి నుంచే పోటీ చేస్తా: మనోహర్

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి తెనాలి నియోజకవర్గం పోటీ చేయబోతున్నాను అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
8.సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో కాంట్రీ బ్యుటరీ పెన్షన్ స్కీం ( సీపీఎస్ ) రద్దు చేస్తా అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కానీ అమలు చేయలేదని మేరకు సెప్టెంబర్ 1 న చలో విజయవాడ అని నిర్వహిస్తున్నామని సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.
9.కొడాలి నాని విమర్శలు

చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అని, 2024 ఎన్నికలే ఆయనకు చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
10.పొంగులేటి విమర్శలు
అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు కర్రు కాశి వాత పెడతారని టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఖమ్మం మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
11.ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గౌరవ సూచికంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసింది.
12.టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమల తిరుపతి పాలకమండలి పదవీకాలం రేపటితో ముగిస్తుంది.ఈరోజు వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో ఈరోజు చివరి సమావేశం నిర్వహించారు.
13.సిపిఐ బస్సు యాత్ర

రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి పేరుతో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో సిపిఐ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
14.ఎస్సై, ఏ ఎస్సై ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణా రాష్ట్ర పోలీస్ నియామక మండలి టీ ఎస్ ఎల్పీ ఆర్పీ ముమ్మరం చేసింది.ఈ మేరకు ఎస్సై, ఏ ఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి.
15.దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది

దేశంలో బిజెపికి ఓటమి భయం పట్టుకుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
16.తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది.
17.పెన్షన్లు పెంచుతాం … కెసిఆర్ ప్రకటన

త్వరలోనే తెలంగాణ లో ఫించన్లు పెంచుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో ప్రకటించారు.
18.పుంగనూరు ఘటనలో 62 మంది అరెస్ట్
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో పోలీస్ వాహనాలపై టిడిపి కార్యకర్తలు 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
19.శ్రీశైలం క్షేత్రం సమాచారం

శ్రీశైలం క్షేత్రంలో సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని ఈవో లవన్న తెలిపారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 55,150
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 60,160
.






