తిరుమలలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుందని సమాచారం.
మెట్ల మార్గం భక్తుల కోసం నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు రూ.4 కోట్లతో షెల్టర్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది పాలకమండలి.తిరుమల రింగ్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ తో పాటు మొదటి ఘాట్ లో రూ.24 కోట్లతో రక్షణ గోడల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.అన్నప్రసాదం భవనంలో వంట సామాగ్రి కొనుగోలు చేయాలని, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు మరియు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి రూ.75.86 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.దాంతోపాటు శ్రీనివాస సేతు వద్ద రూ.3 కోట్లతో సబ్ వే నిర్మించాలని నిర్ణయించిన పాలకమండలి టీటీడీ 69 ప్రాపర్టీలకు ఫెన్సింగ్ కోసం రూ.1.69 కోట్లు కేటాయించింది.







