ప్రపంచంలో దాదాపు 99.99 శాతం మంది జనం ఉద్యోగాలు చేసుకొనే తమ జీవనం కొనసాగిస్తూ వుంటారు.అలా ఉద్యోగాలు చేసిన ప్రతిఒక్కరికీ బాస్ అంటే గౌరవమో, భక్తో, భయమో ఉంటుంది.వర్క్ చేసే విషయంలో తప్పు చేస్తే ఏమౌతుందే అని చాలామంది భయపడుతూ వుంటారు.
ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అనేక రకాల చిత్రమైన విశేషాలు మనం తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలోనే తాజాగా ఓ ఉద్యోగి ఏకంగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ బాస్‌కి మెసేజ్ పెట్టాడు.
ప్రస్తుతం ఈ మెసేజ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.

ఇంతకీ అతను ఏమని మెసేజ్( Message ) చేసాడో తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం చదవాల్సిందే.అవును, ఓ ఆఫీస్ బాస్ తన దగ్గర పనిచేసే ఉద్యోగి నుంచి ఊహించని మెసేజ్ అందుకున్నాడు.తాగిన మైకంలో ఆ ఉద్యోగి బాస్‌కి అర్ధరాత్రి మెసేజ్ పంపాడు.
సిద్ధాంత్ అనే వ్యక్తి తన దగ్గర పని చేసే ఉద్యోగి నుంచి ఊహించని మెసేజ్ అందుకున్నాడు.దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో( Twitter ) షేర్ చేశారు.
అందులోని సారాంశం ఇలా వుంది… ‘బాస్ నేను తాగి ఉన్నాను.మెసేజ్ చేస్తున్నాను.
మీకో విషయం చెబుతాను.నన్ను మీరు నమ్మినందుకు ధన్యవాదాలు.
మంచి కంపెనీ పొందడం కంటే మంచి మేనేజర్ పొందడం చాలా కష్టం.నేను అదృష్టవంతుడిని.
కాబట్టి మిమ్మల్ని మీరు అభినందించుకోండి’ అని ఉంది.

ఇక ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసిన బాస్ సిద్ధాంత్ ‘ఎక్స్ నుంచి ఇలాంటి డ్రంక్ టెక్ట్స్ పర్వాలేదు.కానీ మీకు ఎప్పుడైనా ఉద్యోగులనుండి ఇలాంటి డ్రంక్ టెక్ట్స్‌లు వచ్చాయా?’ అంటూ షేర్ చేశాడు.ఈ ట్వీట్‌పై నెటిజన్లు చాలా పాజిటివ్‌గా స్పందించారు.
బాస్ సిద్ధాంత్ ‘నేను పనిచేసిన అత్తుత్తమ ఫ్రంటెండ్ ఇంజనీర్లలో ఒకడు’ అని చెబుతూ అతనికి మెసేజ్ పంపిన తన ఉద్యోగిని ప్రశంసించాడు.నెటిజనం కూడా తమతమ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం ఇక్కడ చూడవచ్చు.







