ఈ హైబ్రిడ్ టమాటా బరువు కేజీకి పైమాటే.. వీటిని ఇంట్లోనే పండించుకోండిలా...

రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్‌లో టమాటా ముందు వరుసలో ఉందనడంలో సందేహం లేదు.ఈ టమాటా కొనుగోలుదారులపై అధిక భారం మోపితే, రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

 The Weight Of This Hybrid Tomato Is More Than Kg Grow These At Home , Tomatoes,-TeluguStop.com

టమాటాకు ఇప్పుడున్న డిమాండ్ వల్ల జస్ట్ నెల రోజుల సమయంలోనే రైతులు కోటీశ్వరులు అయ్యారు.ఈ నేపథ్యంలో ఒక టమాటా జాతి వైరల్‌గా మారింది.

అదే స్టీక్‌హౌస్ టమాటా అనే హైబ్రిడ్ టమాటా జాతి.సాధారణంగా ఇండియాలో సాగు చేసే ఒక్కో టమాటా బరువు 100 గ్రాముల లోపే ఉంటుంది కానీ స్టీక్‌హౌస్ టమాటా వెయిట్( Steakhouse Tomato Wait ) కేజీ పైనే ఉంటుంది.

అంటే స్టీక్‌హౌస్ టమాటా ఒక్కటి కూర వండితే చాలు ఇంటిళ్ల పాదికీ అది సరిపోతుంది.

స్టీక్‌హౌస్ టమాటా పెద్దగా, గుండ్రని ఆకారంలో ఉంటుంది.

ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.ఇది చాలా రుచిగా ఉంటుంది.

దీనిని సలాడ్‌లు, సూప్‌లు, శాండ్‌విచ్‌లు, ఇతర వంటకాలలో మిక్స్ చేసుకోవచ్చు.స్టీక్‌హౌస్ టమాటా మొక్కలు 5 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.

ఇవి చలిని అస్సలు తట్టుకోలేవు.ఇండియాలో వీటిని పెంచడం సాధ్యమవుతుంది.

కాకపోతే చలి వాతావరణంలో కాకుండా వీటిని వేసవిలోనే నాటాలి.స్టీక్‌హౌస్ టమాటా మొక్కలకు సూర్యకాంతి చాలా అవసరం.

వీటిని పూర్తి సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో నాటాలి.స్టీక్‌హౌస్ టమాటా మొక్కలు 75 నుంచి 80 రోజులలో పంటను అందిస్తాయి.

Telugu Hybrid Tomatoes, Latest, Tomato, Tomatoes-Latest News - Telugu

స్టీక్‌హౌస్ టమాటా మొక్కలను తోటలో లేదా కుండలో పెంచవచ్చు.తోటలో పెంచాలంటే, 24 నుంచి 36 అంగుళాల వెడల్పు ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి.కుండలో పెంచాలంటే, కనీసం 20 అంగుళాల వెడల్పు ఉన్న కుండను ఎంచుకోవాలి.స్టీక్‌హౌస్ టమాటా మొక్కలకు ఎక్కువ నీరు అవసరం.మట్టిపైనున్న పొర డ్రై అయినట్లు అనిపించగానే నీరు పెట్టడం చాలా అవసరం.స్టీక్‌హౌస్ టమాటా మొక్కలకు ఎరువు కూడా చాలా కీలకం అందువల్ల నెలకు ఒకసారి ఎరువు వేయాలి.

Telugu Hybrid Tomatoes, Latest, Tomato, Tomatoes-Latest News - Telugu

స్టీక్‌హౌస్ టమాటా మొక్కలకు పూలు రావడం ప్రారంభించిన తర్వాత, పువ్వులను తీసివేయాలి.దీని వల్ల మొక్కలు మరింత టమాటాలను ఉత్పత్తి చేస్తాయి.స్టీక్‌హౌస్ టమాటాలు పూర్తిగా ఎర్రగా మారిన తర్వాత, వాటిని కోయవచ్చు.స్టీక్‌హౌస్ టమాటాలు టేస్టీగా ఉండటమే కాదు అవి చాలా పోషకాలను అందిస్తాయి.వీటిని వివిధ రకాల వంటకాలలో ఉపయోగించవచ్చు.స్టీక్‌హౌస్ టమాటా మొక్కలను పెంచడం సులభం.

టమాటా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు కాబట్టి మీరు మీ తోటలో లేదా కుండలో స్టీక్‌హౌస్ టమాటా మొక్కలను పెంచడానికి ప్రయత్నించండి.మార్కెట్లో ఈ టమాటాలకు సంబంధించిన విత్తనాలు దొరుకుతాయి.

వాటిని కొనుగోలు చేసే మీరు మీ ఇంట్లోనే వీటిని సాగు చేయడం ప్రారంభించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube