గాయకుడు, ప్రజా గొంతుక గద్దర్ మృతికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.గద్దర్ మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని చెప్పారు.
ప్రజల కోసం గద్దర్ అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు.
గద్దర్ తెలంగాణ పోరాట యోధుడని రేవంత్ రెడ్డి కొనియాడారు.
గద్దర్ మృతికి సంతాపంగా అన్ని మండల కేంద్రాల్లో గద్దర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.