అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలంటున్నారన్న సీఎం వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.నోరు ఉందని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం తలుచుకుంటే మీ తాట తీసేవాళ్లమే కానీ తాము సంయమనం పాటిస్తున్నామని వెల్లడించారు.తన చావు మీదకు తెచ్చుకుని తెలంగాణ తెచ్చుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ నేడు సుస్థిర అభివృద్ధిని సాధించిందని తెలిపారు.దళితబంధు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించిన కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
దేశంలోనే 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.ఎంత క్రమశిక్షణ పాటిస్తే 24 గంటల కరెంట్ సాధ్యం అవుతుందని తెలిపారు.
అంతేకాకుండా 25 వేల మెగావాట్ల రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతోందని హర్షం వ్యక్తం చేశారు.







