సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) అందగాడు కాగా ఆరోగ్యం విషయంలో మహేష్ బాబు ఎంతో కేర్ తీసుకుంటారు.ఫిట్ నెస్ కు, హెల్త్ కు మహేష్ బాబు ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.
అయితే ఒకానొక సమయంలో మహేష్ బాబు మైగ్రేన్ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు.మహేష్ బాబు స్వయంగా ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు.
చాలా సంవత్సరాల నుంచి ఈ వ్యాధి వేధించిందని మహేష్ తెలిపారు.

మైగ్రేన్( Migraine ) కు చికిత్స లేదని చాలామంది చెప్పారని ఆయన పేర్కొన్నారు.ఎంతోమంది డాక్టర్లను కలిశానని, ఎన్నో మందులు వాడానని తాను ఎంత కష్టపడినా ఉపశమనం మాత్రం లభించలేదని మహేష్ బాబు వెల్లడించారు.పెయిన్ కిల్లర్స్ వాడుతూ కాలం గడిపానని కొన్నిసార్లు రోజులో 6 నుంచి 7 గంటల పాటు ఈ వ్యాధి వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు సైతం ఉన్నాయని మహేష్ బాబు పేర్కొన్నారు.
నా బాధను చూసి నమ్రత( Namrata ) తన ఫ్రెండ్ సహాయంతో డాక్టర్ సత్య సింధూజను కలిసి చక్రసిద్ధ నాడీ వైద్యం( Chakrasiddh Treatment ) చేయించిందని ఆ చికిత్స తర్వాత నా మైగ్రేన్ మటుమాయం అయిందని మహేష్ చెప్పుకొచ్చారు.తనలా మైగ్రేన్ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ చికిత్స చేయించుకోవడం ద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపవచ్చని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.
మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు.

గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సంక్రాంతి పండుగ మహేష్ కు కలిసొచ్చిన పండుగ కాగా గుంటూరు కారం సినిమా మహేష్ ఫ్యాన్స్ ను మెప్పించి మహేష్ కోరుకున్న మరో భారీ సక్సెస్ ను అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.







