రీసెంట్ గానే తమిళ హీరో సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'( Surya Son Of Krishnan ) అనే సినిమా రీ రిలీజ్ అయ్యి దుమ్ములేపే వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఒక డబ్ సినిమా రీ రిలీజ్ అయితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా చేసింది ఈ సినిమా.
ఈ చిత్రం లోని ప్రతీ పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది , అందుకే ఈ రేంజ్ లో జనాలు ఆదరించారు అని అంటున్నారు విశ్లేషకులు.రీ రిలీజ్ లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి షాక్ కి గురైన ప్రేక్షకులు అసలు ఈ సినిమాలో అంత విషయం ఏముంది అని యూట్యూబ్ లో వెతికి చూసారు.
చూసిన తర్వాత వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అమోఘం అనే చెప్పొచ్చు.ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం లో అసలు ఆశ్చర్యమే లేదు అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి గౌతమ్ వాసుదేవ్ మీనన్( Gautham Vasudev Menon ) దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాని తొలుత గౌతమ్ మీనన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేద్దాం అని అనుకున్నాడు.అప్పుడే రామ్ చరణ్ చిరుత సినిమా( Chirutha Movie )ని విడుదల చేసి ఉన్నాడు.ఈ అబ్బాయి ఎవరో చాలా బాగా నటించాడు, నా సినిమాకి ఇతను అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడు అని అనుకోని రామ్ చరణ్ కి ఈ స్టోరీ ని వినిపించాడు.
అయితే రామ్ చరణ్( Ram Charan ) కి స్టోరీ చాలా బాగా నచ్చింది కానీ, తండ్రి పాత్ర ఇంత చిన్న వయస్సు లో తనకి సరిపోతుందా లేదా అనే భయం తో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు.ఇక ఆ తర్వాత వెంటనే గౌతమ్ మీనన్ సూర్య ని కలిసి ఈ స్టోరీ వివరించడం.
ఆయనకీ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఇకపోతే ఈ చిత్రం అప్పట్లో తమిళం లో పెద్ద హిట్ అయ్యింది కానీ, తెలుగు లో మాత్రం అంతగా ఆడలేదు.
అప్పట్లో తెలుగు లో వచ్చిన వసూళ్ల కంటే ఇప్పుడు రీ రిలీజ్ లో వచ్చిన వసూళ్లే ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్( 1 Crore 50Lakhs ) వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ఇదే ఊపు కొనసాగిస్తే ఈ చిత్రం రీ రిలీజ్ హిస్టరీ లో టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పొచ్చు.







