బారసా ఇన్ రిపేర్ మోడ్!?

రెండు సార్లు అధికారం చలాయించిన ఏ పార్టీకైనా ప్రభుత్వ వ్యతిరేకత మరియు పార్టీ నాయకులలో అసంతృప్తి అన్నది సహజంగానే వస్తుంది.ఇప్పుడు భారాస( BRS ) కూడా అదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది .

 Unsatisfied Leaders Increasing In Brs Party Details, Unsatisfied Leaders , Brs P-TeluguStop.com

ఎంత మంచి పరిపాలన అందించి సంక్షేమ పథకాలు అమలు చేసినా దాన్ని తాలూకు లబ్ధిదారులు కాని వారికి ఉండే అసంతృప్తి మరియు పార్టీ కోసం కష్టపడితే తమకు పదవులు రాలేదన్న ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల అసంతృప్తి వెరసి ఏ పార్టీకైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది.అదేవిధంగా కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యాలోపు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకునే క్రమంలో అవినీతికి పాల్పడటం కూడా రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు మారిపోయింది .

బారాసా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో( Sitting MLAs ) మెజారిటీ ఎమ్మెల్యేలపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ ఆరోపణలపై ప్రతిపక్ష భాజపా కాంగ్రెస్ లు భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే చర్యలు తీసుకుంటున్నాయి .అయితే వీరందరినీ పూర్తిగా తొలగించి కొత్తవారిని నియమిస్తారనే ప్రచారం ఒక దశలో జరిగినప్పటికీ ఇంత కీలక నాయకులను పోగొట్టుకొని ఎన్నికల ను ఎదుర్కోవటం

Telugu Brs, Cm Kcr, Hareesh Rao, Ktr, Schemes, Telangana, Unsatisfied-Telugu Pol

ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ అని భావిస్తున్న బారాసా నాయకత్వం పాట వారితోనే ఎన్నికలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నదట.కొన్ని నియోగ్యక వర్గాలలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలను( Key Leaders ) పిలిపించి కొన్ని సర్దుబాట్లు చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా వర్గ పోరు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో ఆయా నాయకులను బారసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) మరియు ట్రబుల్ షూటర్ హరీష్ రావు( Hareesh Rao ) తమ వద్దకు పిలిపించుకొని ఇష్యూ స్ ని సెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Brs, Cm Kcr, Hareesh Rao, Ktr, Schemes, Telangana, Unsatisfied-Telugu Pol

ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి మెజారిటీ నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలను చక్కదిద్దుకొని పూర్తి ఎనర్జీతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న బారాస తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి అక్కడి సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి భారాశా చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube