బిగ్ షార్ట్స్ చూపు - జనసేన వైపు?

నిన్న మొన్నటి వరకు జనసేన రాజకీయ భవిష్యత్తుపై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు.అయితే క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్న మార్పులు జనసేనను( Janasena ) క్రియాశీలక పార్టీగా రాజకీయ యువనికపై నిలబడుతున్నాయి .

 Big Shots Eye On Janasena Party Ticket Details, Janasena Party Ticket, Janasena-TeluguStop.com

ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పొత్తు విన్నింగ్ కాంబినేషన్ అని ఫిక్స్ అయిపోవడంతో ఇప్పటికే నాయకులతో కిక్కిరిసిపోతున్న తెలుగుదేశం లో సీట్లపై కొత్తవారికి అవకాశం లేనందున పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్లపై చాలామంది పెద్దలు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఉబయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా జనసేన తీసుకుంటుందని భావిస్తున్న కొంతమంది రాజకీయ ఆశవహులు వ్యాపారవేత్తలు జనసేన సీటుపై ఆయన నియోజకవర్గాలలో పోటీ చేయాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Janasena Candis, Janasena Ticket, Pawan

జనసేనలో నాయకులకు కొదవ లేనప్పటికీ ,అంగ బలం అర్థ బలం ఉన్న నాయకులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.దాంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో( Assembly ) తమ ముద్ర వేయాలని బావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలను ఎదుర్కోవడానికి ధన బలం కూడా అవసరమని గ్రహించినట్లుగా ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి.పార్టీలోకి తీసుకొస్తున్న అభ్యర్థులను వ్యతిరేకించవద్దు అంటూ ఆయన పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానిచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ,.దాంతో ఈసారి జనసేన వైపు నుంచి కూడా బలమైన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Janasena Candis, Janasena Ticket, Pawan

పార్టీకి ఎంత ప్రజాదరణ ఉన్నప్పటికీను ఆఖరి నిమిషంలో పంచే డబ్బులు కూడా ఫలితాలపై కీలక ప్రభావం చూపిస్తున్నాయి అన్న సర్వే రిపోర్టులను( Survey ) ఇప్పటికే పవన్ అధ్యయనం చేశారని అంతే కాకుండా అధికార పార్టీ కూడా ఈసారి భారీ ఎత్తున ధన ప్రవాహం కురిపించే అవకాశం ఉందన్న విశ్లేషణలతో పవన్ కూడా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే టిడిపి టికెట్ ఆశిస్తున్న చాలామందిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) జనసేన ద్వారా రూటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇది చంద్రబాబుకు అలవాటేనని ఇంతకుముందు కామినేని శ్రీనివాసరావు లాంటి లీడర్ని కూడా వయా బిజెపి మంత్రిని చేశారని ఆయన టిడిపికి మొదటి నుంచి లాయల్ గా ఉంటారన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube