మన టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చే జంట సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్( Namrata Shirodkar ) కపుల్.వీరు కలిసి సినిమాల్లో నటించడమే కాకుండా జీవితాన్ని కూడా పంచుకుని భార్యా భర్తలుగా మారిపోయారు.
వంశీ సినిమా( Vamsi Movie ) సమయంలో వీరి మధ్య లవ్ మొదలయ్యింది.ఆ లవ్ కాస్త పెళ్ళికి కూడా దారి తీసింది.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు అన్యోన్య దంపతులుగా కలిసి మెలిసి ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకంతో ముందుకు వెళుతున్నారు.ఈ జంట భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా కూడా సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.
మరి ఈ అందమైన జంట ఎప్పుడు సోషల్ మీడియాలో తమ పిక్స్ షేర్ చేసిన అవి నిముషాల్లోనే వైరల్ అవుతాయి.

ఒకరిపై ఒకరు ఈ జంట ప్రేమను పంచుకోవడంతో అస్సలు వెనుకాడరు.మరి ప్రజెంట్ మహేష్ బాబు( Mahesh Babu ) ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ వెకేషన్ ( Vacation ) నుండి ఇప్పటికే కొన్ని పిక్స్ బయటకు వచ్చి వైరల్ కాగా ఇప్పుడు మహేష్ తన భార్యతో కలిసి దిగిన అందమైన పిక్ ను షేర్ చేసుకున్నాడు.
ఈ పిక్ అందరిని ఆకట్టు కుంటుంది.

ఈ పిక్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఫైర్ వర్క్స్ ను ఇద్దరు కలిసి చూస్తూ ఉండగా దిగిన అద్భుతమైన పిక్ ను అందరితో పంచుకున్నాడు.ఈ పిక్ తో మరోసారి మహేష్ తన ప్రేమను ఈ విధంగా తెలిపారు.ఇద్దరు ఎంతో అపురూపమైన క్షణాలను తమ డైరీలో రాసుకుంటున్నట్టు అనిపిస్తుంది.
అందుకే ఈ పిక్ అందరికి బాగా నచ్చింది.మరి ఆ బ్యూటిఫుల్ పిక్ ను మీరు చూసేయండి.







