ఐఏఎస్( IAS ) కావాలని కలలు కనే వాళ్లు లక్షల సంఖ్యలో ఉండగా ఆ లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే వాళ్లు పదుల సంఖ్యలో ఉంటారు.ఎలాంటి కోచింగ్ లేకుండా ఐఏఎస్ అయిన దీక్షితా జోషి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్దాన్వీ( Haldwani )కి చెందిన దీక్షితా జోషి 2022 సంవత్సరంలో జాతీయ స్థాయిలో 58వ ర్యాంక్ సాధించారు.

దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్( UPSC Civil Services ) లో ఆమె అత్యుత్తమ ప్రతిభ చాటారు.దీక్షితా జోషి ఈ స్థాయిలో నిలవడం కోసం అనుభవించిన కష్టం అంతాఇంతా కాదు.ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హల్దాన్వీ నివాసి అయిన దీక్షితా జోషి( Dikshita joshi ) తల్లి ఇంటర్ కాలేజ్ లో హిందీ లెక్చరర్ కాగా తండ్రి ఫార్మసిస్ట్ గా పని చేసేవారు.
ఐఐటీ మండీ నుంచి మాస్టర్స్ చేసిన దీక్షిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారు.కష్టపడితే ఏదైనా సాధించవచ్చని తన ప్రతిభతో ఆమె ప్రూవ్ చేశారు.
సొంత ప్రిపరేషన్ తో ఐఏఎస్ అయ్యి తనలా కష్టపడే వాళ్లకు ఆదర్శంగా నిలవడంతో పాటు కెరీర్ విషయంలో మరింత సక్సెస్ అయ్యే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.లైఫ్ లో ఓటమికి ఎప్పుడూ భయపడవద్దని బలమైన సంకల్పంతో ముందుకు వెళితే సక్సెస్( Success Story ) సొంతమవుతుందని దీక్షిత వెల్లడించడం గమనార్హం.

ఏకాగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా కష్టపడితే మాత్రమే సక్సెస్ దక్కుతుందని దీక్షిత వెల్లడించారు.ఎన్.సి.ఈ.ఆర్.టీ( NCERT ) పుస్తకాల నుంచి నోట్స్ ను సిద్ధం చేసుకుంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలో మంచి ఫలితాలు సొంతమవుతాయని దీక్షిత అన్నారు.దీక్షిత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఐఏఎస్ దీక్షిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ అవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఆమె సక్సెస్ స్టోరీ విని ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు.







