ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఓటీటీలలో విడుదలవుతున్న వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.జేడీ చక్రవర్తి ( JD Chakravarthy )ప్రధాన పాత్రలో తెరకెక్కిన దయా వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో జేడీ చక్రవర్తి భార్య పాత్రలో ఈషా రెబ్బా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.కొన్ని చిన్నచిన్న లోపాలు ఉన్నా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ వెబ్ సిరీస్ కు పవన్ సాధినేని దర్శకుడు కాగా పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ విష్ణుప్రియను ఫిజిక్ కోసం పెట్టుకున్నానని తెలిపారు.ఈ సినిమాలో విష్ణుప్రియ పోషించిన పాత్రకు యాక్టింగ్ రాకపోయినా పరవాలేదని అన్నారు.ఆ రోల్ కు ఫిజిక్ ఉంటే చాలని ఫీల్ అయ్యానని పవన్ సాధినేని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ విష్ణుప్రియకు మంచి హార్ట్ ఉందని నైస్ సోల్ అని తెలిపారు.విష్ణుప్రియ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని వెల్లడించారు.కథ, ఐదో ఎపిసోడ్ ట్విస్ట్, జేడీ చక్రవర్తి నటన ఈ వెబ్ సిరీస్ కు హైలెట్ గా నిలవగా కవిత, కౌశిక్ పాత్రల మధ్య డ్రామా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఈ వెబ్ సిరీస్ కు మైనస్ అయ్యాయి.
హాట్ స్టార్ కు ఈ వెబ్ సిరీస్ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.దయా వెబ్ సిరీస్( Dayaa ) తో జేడీ చక్రవర్తి ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి.
జేడీ చక్రవర్తి తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జేడీ చక్రవర్తి ఇండస్ట్రీపై దృష్టి పెడితే మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.







