యాక్టర్ అంటే హీరో మాత్రమే కాదు.నిజమైన యాక్టర్ అంటే ఏ పాత్ర ఇచ్చిన పాత్రకు తగ్గట్టు తనను తానూ మౌల్డ్ చేసుకొని నటించగలగాలి.
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనను తానూ ఛాలంజ్ చేసుకోవాలి.అటువంటి నటులు ఈ తరంలో పుష్కలంగా ఉన్నారు.వారిలో కొందరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
రానా:
లీడర్ చిత్రంతో సినీ ప్రేక్షకులకు పరిచయమైనా రానా, తరువాత వరుసగా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.రానా తన కెరీర్ లో హీరోగా చేసినా పాత్రల కన్నా విల్లన్ గా నటించినవే అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.బాహుబలి( Baahubali ) చిత్రంలో భళ్లాలదేవునిగా నటించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించాడు.
నేనే రాజు నేనే మంత్రి, భీమ్లా నాయక్ చిత్రాలలో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేసాడు.రానా తాను ఎంచుకునే కథల ద్వారా తనలో ఉన్న హీరో కన్నా నటుడ్ని ఎక్కువ సంతృప్తి పరుస్తాడు.

గోపిచంద్:
తొలివలపు చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోపిచంద్( Gopichand ), ప్రేక్షకాదరణ పొందింది మాత్రం జయం సినిమాతోనే.జయంలో విల్లన్ గా నటించి మంచి గుర్తింపు పొందాడు.ఈ చిత్రంలో ఆయన అభినయం అద్భుతం.తరువాత మహేష్ బాబు నిజం, ప్రభాస్ వర్షం చిత్రాలలో విల్లన్ గా నటించి మెప్పించాడు.తాజాగా గౌతమ్ నందలో హీరోగా, విల్లన్ గా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించాడు.ఈ తరం హీరోలలో, హీరోగా, విల్లన్ గా, రెండు పాత్రలకు న్యాయం చెయ్యగల యాక్టర్ గోపిచంద్ అనడంలో ఏ సందేహం లేదు.
విజయ్ సేతుపతి:
మక్కల్ సేల్వన్ విజయ్ సేతుపతి….ఉప్పెన సినిమాలో రాయణం గా విల్లన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
తమిళం లో వన్ అఫ్ ది సూపర్ స్టార్స్ గా చెలామణి అవుతున్న విజయ్ నెగటివ్ రోల్స్ చెయ్యడానికి ఏ మాత్రం సందేహించడు.తాజాగా లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ చిత్రంలో కూడా విల్లన్ గా నటించి మెప్పించాడు.
ఈ తరం యాక్టర్స్ లో విజయ్ మోస్ట్ వెర్సటైల్ అని చెప్పొచ్చు.

ఆది పినిశెట్టి :
తెలుగు, తమిళ పరిశ్రమలలో స్టార్ హీరో ఆది పినిశెట్టి.తేజ దర్శకత్వం వహించి ఒక వీ చిత్రం సినిమా ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.తరువాత వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
హీరోగా చాలా సినిమాలలో నటించగా ఆది, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది మాత్రం అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు( Sarrainodu ) చిత్రం తోనే.ఈ చిత్రంలో విల్లన్ గా నటించి మంచి మార్కులు సంపాదించాడు ఆది.తరువాత అజ్ఞాతవాసి, ది వారియర్ చిత్రాలతో కూడా విల్లన్ గా అదరగొట్టాడు.







