దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి త్రిష( Trisha ) ఒకరు.ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.
అయితే హీరోయిన్ కి ఇండస్ట్రీలో చాలా తక్కువ లైఫ్ టైం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ఇలా త్రిషతో పాటు ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా వచ్చినటువంటి వారు కొందరు ఇండస్ట్రీకి దూరమైపోగా మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోయిన్ గా, కాకుండా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే త్రిష మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి కానున్నాయి.అయినప్పటికీ ఈమె మాత్రం హీరోయిన్గా సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో కొనసాగుతూ ఉన్నారు.వయసు పెరిగే కొద్దీ త్రిష తన అందాన్ని పెంచుకుంటూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష కెరియర్ గురించి సీనియర్ నటి కుష్బూ( Khushbu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక చిట్ చాట్‌లో ఖుష్బూ మాట్లాడుతూ.నటీమణులు 20 ఏండ్లుగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం.కానీ త్రిష 20ఏళ్లకుపైగా లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతూ నంబర్‌వన్ నటిగా నిలబడింది.త్రిష మేల్ సూపర్ స్టార్ లాగా క్రౌడ్ పుల్లర్.అంటూ కితాబిచ్చింది.ఖుష్బూ త్రిష కెరియర్ పై స్పందిస్తూ ఆమె పట్ల ప్రశంసలు కురిపించడంతో ఈ కామెంట్స్ కోసం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక తాజాగా త్రిష మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ ( Ponniyan Selvan ) సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం తమిళ భాష చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.







