జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఇందులో భాగంగా ఏపీలోని ప్రస్తుత పరిస్థితులతో పాటు పొత్తులపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.
అదేవిధంగా విశాఖలో ప్రారంభించనున్న మూడో విడత వారాహి విజయ యాత్రపై కూడా నేతలతో చర్చించారు.అనంతరం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహార్ అన్నారు.
ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.పార్టీ అధిష్టానం నియమించిన ఇంఛార్జ్ లను పార్టీ శ్రేణులు గౌరవించాలని సూచించారు.
ప్రతి సమావేశంలో వీర మహిళలు, జన సైనికులు భారీగా హాజరయ్యేలా చూసుకోవాలని తెలిపారు.పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆహ్వానించిన వాళ్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
రాష్ట్రంలో మార్పు కోసం జనసేన బలంగా నిలబడాలని వెల్లడించారు.







