సౌత్ స్టార్ హీరోయిన్ లలో నయనతార( Nayanthara ) ఒకరు.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈమె స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బోల్డ్ నెస్ కు దూరంగా ఉంటూ కథాబలం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ గ్లామర్ పాత్రలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను( Director Vignesh Shivan ) ప్రేమించి కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది.
ఈయనతో పెళ్లి తర్వాత ఎన్ని కమర్షియల్ సినిమాల ఆఫర్స్ వచ్చిన రిజక్ట్ చేస్తూనే ఉంది.కోలీవుడ్( kOLLYWOOD ) లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.ఒకప్పుడు వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకున్న ఈ భామ ఈ మధ్య హిట్స్ లేక ఫామ్ కోల్పోయింది.దీంతో మళ్ళీ వరుస హిట్స్ అందుకుని ఫామ్ లోకి రావాలని చూస్తుంది.
ఇక టాలీవుడ్ లో సినిమాలు చేయడం మొత్తానికే మానేసింది.స్టార్ హీరోలకు కూడా నో చెబుతుంది.అయితే ఇప్పుడు తెలుగులో కూడా ఛాన్స్ వస్తే ఓకే చెబుతుందట.అయితే తెలుగులో నటించాలంటే ఈమె పెట్టిన కండిషన్ కు ఓకే చెప్పాలట.అది ఏంటంటే ఈమెకు హీరోలకు ఇచ్చినంత రెమ్యునరేషన్ ఇవ్వాలట.అమ్మడు చెప్పిన కండిషన్ కు నిర్మాతలు షాక్ అవుతున్నారు.
ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోలకు 50 నుండి 100 కోట్ల రెమ్యునరేషన్స్ అనుకుంటున్నారు.మరి అదే రేంజ్ లో నయనతారకు ఇవ్వాలంటే అది జరిగే పని కాదు.
కోలీవుడ్ లో అమ్మడు డిమాండ్ చేసినంత ఇస్తున్నారు.అయితే టాలీవుడ్ లో హీరోలకు అంత ఇస్తున్న హీరోయిన్లకు 5 నుండి 10 కోట్ల లోపు లోనే ఇస్తున్నారు.
మరి అంత రేంజ్ లో ఇచ్చి నయన్ ను తీసుకోవడానికి మన నిర్మాతలు సుముఖత వ్యక్తం చేయడం లేదు.