పెళ్లిలో( Wedding ) అనేక వింత ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.వధూవరులు వింతగా ప్రవర్తించడం లాంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.
ఇక పెళ్లిలోనే వధువును వరుడు వేధించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.దీంతో వధువు( Bride Groom ) పెళ్లి నిరాకరించడంతో వరుడు షాక్ తినడం లాంటి జరుగుతూ ఉంటాయి.
అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో వరుడిని వధువు చితకబాడింది.కింద పడేసి చితక్కొట్టింది.
బంధువులంతా చూస్తుండగానే పొట్టు పొట్టు కొట్టింది.ఈ షాకింగ్ పరిణామంతో బంధువులందరూ నోరెళ్లబెట్టారు.

పెళ్లిలో వధూవరుల కోసం బంధువులందరూ వెయిట్ చేస్తున్నారు.ఈ తరుణంలో వధూవరులు ఆనందంగా మండపంపైకి అడుగుపెట్టారు.అయితే రాగానే వరుడిని వధువు కడుపుపై కాలితో తన్నింది.ఆ తర్వాత వరుడి తల పట్టుకుని ధమేల్ మని కింద పడేసింది.పక్కనే ఉన్న ఒక వ్యక్తి రెఫరీ( Referee ) పాత్ర పోషించి కింద పడ్డ వరుడి కాలుని వధువుపైకి ఎత్తి పట్టుకుంటుంది.ఆ తర్వాత రెఫరీ ఒకటి , రెండు అంటూ కౌంటర్ చేస్తుంది.
ఆ తర్వాత వరుడు పైకి లేవకపోయే సరికి వధువుని విజేతగా రెఫరీ ప్రకటిస్తాడు.అయితే భార్య చేతిలో ఓడిపోయినందుకు వరుడు నవ్వుతాడు.

అయితే తనను గెలిపించినందుకు వరుడకి వధువు ధన్యవాదాలు చెబుతుంది.తొలుత అతిధులందరూ దీనిని చూసి షాక్ అవుతారు.అయితే ఆ తర్వాత కామెడీ కోసం ఇలా చేశారని తెలుసుకుని తెగ నవ్వుకున్నారు.అందరూ పగలబడి నవ్వడంతో పెళ్లి ఫంక్షన్ సందడిగా మారింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి రోజే భార్యతో కొట్టించుకున్నాడని, పెళ్లైన తర్వాత ఇక రోజూ కొట్టించుకోవాల్సిందేనిని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.పెళ్లైన తర్వాత భార్యపై ఎప్పుడైనా చేయి చేసుకోవాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడని మరికొందరు అంటున్నారు.







