మెగా ఇంట్లోకి మూడో తరం వారసురాలు అడుగుపెట్టడంతో మెగా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan Tej) ఉపాసన (Upasana) పెళ్ళైన 11 సంవత్సరాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
చిన్నారి జూన్ 20 వతేదీ జన్మించారు.ఇక చిన్నారికి క్లిన్ కారా కొణిదెల (Klin Kaara Konidela) అని నామకరణం కూడా చేశారు.
ఇక ప్రిన్సెస్ కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పటివరకు ఈమె దర్శనం మాత్రం అభిమానులకు కాలేదని చెప్పాలి.
మెగా మనవరాలిని ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే డెలివరీ తర్వాత ఉపాసన సరాసరి చిరంజీవి(Chiranjeevi) ఇంటికి వచ్చేసారు.ఇక్కడే చిన్నారి నామకరణ వేడుకలను కూడా నిర్వహించారు.అయితే మొదటిసారి ఉపాసన తన కూతురితో కలిసి తన తల్లి గారి ఇంటికి వెళ్లారట.ఇలా తన మనవరాలు ఇంటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపాసన తల్లి శోభన కామినేని (Shobana Kaminei) చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.
తన మనవరాలు ఇంటికి రాగానే కేవలం అ చిన్నారికి దిష్టి తీసినటువంటి వ్యక్తికే లక్ష రూపాయల డబ్బు ఇచ్చారని తెలుస్తోంది.అదేవిధంగా చిన్నారి తన ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే శోభన కామినేని ఏకంగా చిన్నారి చేతి పాదముద్రులను తీసుకొని వాటిని బంగారంతో తయారు చేయించి వాటిని ఒక ప్రేమ్ చేయించి భద్రపరచబోతున్నట్లు తెలుస్తోంది.ఇలా పెళ్లయిన తర్వాత 11 సంవత్సరాలకు తన కూతురు తల్లి కావడం పట్ల కామినేని కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక తన మనవరాలికి పెట్టినటువంటి క్లిన్ కారా అనే పేరును తాను ఉపాసనకు పెట్టాలనుకున్నాను అంటూ ఈమె వెల్లడించిన సంగతి కూడా మనకు తెలిసిందే.