డైరెక్టర్ శ్రీవాస్ రీసెంట్ గా గోపి చంద్ ని హీరో గా పెట్టీ రామబాణం అనే సినిమా తీశాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు దాంతో ఆయన ప్రస్తుతం ఏం సినిమా చేయాలి అనే ఆలోచన లో ఉన్నట్టు గా తెలుస్తుంది…

నిజానికి ఈయనకి గోపిచంద్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది ఇక ఆ చనువు తోనే వీళ్లిద్దరి కాంబో లో ముందు గా వచ్చిన లక్ష్యం లౌక్యం రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి ఇక అదే ఊపు లో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు.కానీ ఈ సినిమా అనుకోకుండా బోల్తా కొట్టింది దాంతో వీళ్ళ కాంబో లో హైట్రిక్ హిట్ సినిమా మిస్ అయిందనే చెప్పాలి…ఇక ఇప్పుడు అందుకే ఆయన కొంచం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమా తియ్యాలి అని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది…నిజానికి శ్రీవాస్ అంటే ఇక మంచి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తాడు… ఆయన గత చిత్రాలను కనక చూసుకుంటే లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ,లౌక్యం, డిక్టేటర్ లాంటి సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నాడు…

ఇప్పుడు ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనే విషయాలు అయితే ఇంతవరకు తెలియలేదు…అప్పట్లో వెంకటేష్ తో కూడా ఒక సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా వర్క్ ఔట్ కాలేదు కానీ ఈసారి మాత్రం పక్క వెంకటేష్ తో సినిమా ఉంటుంది అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు అయితే ఏ జానర్ లో ఉంటుందో తెలియడం లేదు ఇక వెంకటేష్ మిస్ అయితే నాగార్జున కి సరిపడా ఇంకో కథ కూడా తన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈయన సినిమాలు ఎంతవరకు ఎంత వరకు వర్క్ ఔట్ అవుతాయో తెలియదు… మరి ఈసారి ఎలాంటి సినిమాతో వచ్చి హిట్ కొడతాడో చూడాలి…








