ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) వారాహి యాత్ర ద్వారా వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జనసేన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే రెండు విడతల యాత్రను పూర్తి చేసిన పవన్ మూడో విడత వారాహి యాత్రను విశాఖ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉత్తరాంధ్రలో జనసేనకు ఆదరణ ఉంటుందని, ఈసారి అక్కడ నుంచి ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాతో పవన్ ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి తో పొత్తు కుదిరినా, కుదరకపోయినా జనసేన సొంతంగానే మెజార్టీ సీట్లు బిజెపి సహకారంతో గెలుచుకుంటుందనే ధీమాతో పవన్ ఉండగా, మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు తన వయసును సైతం లెక్కచేయకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు.

ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఏపీ అంతటా పర్యటించి ప్రజల్లో వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా బాబు ముందుకు వెళుతున్నారు.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) యువ గళం పాదయాత్రతో అన్ని నియోజకవర్గాల మీదుగా పాదయాత్రను నిర్వహిస్తున్నారు.ఈ విధంగా తమ రాజకీయ శత్రువులు అంతా మూకుమ్మడిగా తమపై విమర్శలు చేస్తూ , జనాల్లో వైసిపి ప్రభుత్వం గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా, జగన్ మాత్రం టార్గెట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తున్నారు.
ప్రజా సంక్షేమ పథకాలు తమను మళ్ళీ అధికార పీఠంపై కూర్చోబెడతాయని నమ్ముతున్నారు.పవన్, చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు పట్టించుకోరని జగన్ అంచనా వేస్తున్నారు.తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు , నియోజకవర్గ ఇన్చార్జీలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ నియోజకవర్గాల్లో వైసిపి గ్రాఫ్ పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజలకు వైసీపీ ప్రజా ప్రతినిధులు అంతా దగ్గర అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఏ ఏ విషయాల్లో వ్యతిరేకత ఉందో తెలుసుకుంటూ వాటికి తక్షణం పరిష్కారం మార్గం చూపిస్తున్నారు .ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నా, ఎక్కడా సంక్షేమ పథకాలకు లోటు లేకుండా జగన్ చూస్తున్నారు.ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ప్రకటిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.ఇక వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి మూకుమ్మడిగా వచ్చినా తమ విజయానికి డోకా లేకుండా చేసేందుకు జగన్ సరికొత్త ప్లాన్ లతో ముందుకు వస్తున్నారు.

ఏ విషయంలోనూ, ఏ వర్గంలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని పదేపదే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నియోజకవర్గ ఇన్చార్జీలకు చెబుతూనే పార్టీని మరింతగా జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు.ఏ ఏ విషయాల్లో సంతృప్తి ఉంది ఏ ఏ విషయాల్లో వ్యతిరేకత ఉందనేది సర్వేల ద్వారా తెలుసుకుంటూ, ఆ అంశాలపైనే ఫోకస్ పెడుతున్నారు.వచ్చి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్( CM jagan ) రాజకీయ అడుగులు వేస్తున్నారు.







