ఏపీలో వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈ మేరకు యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో సుమారు 3,295 పోస్టులను భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 Green Signal For Filling Up Of Posts In Varsity And Triple It In Ap-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు.సెప్టెంబర్ మూడు, నాలుగు వారాల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండగా ఆన్ లైన్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు అధికారులు.

అదేవిధంగా అక్టోబర్ 10వ తేదీకకల్లా పరీక్షా ఫలితాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోనున్నారు.ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియ నవంబర్ 15వ తేదీ నాటికి ముగియనుండగా ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు.

కాగా ప్రభుత్వం భర్తీ చేయనున్న ఈ పోస్టుల్లో యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ లతో పాటు ట్రిపుల్ ఐటీలలో 660 పోస్టులు ఉన్నాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube