కూరల్లో సాధారణ ఉప్పుకి బదులుగా.. దీనిని వాడి చూడండి అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం..!

ఇప్పుడు ఏ వయసు వారిని చూసినా ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అని చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు.ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే ఆరోగ్య సమస్యలు( Health problems )ఇప్పుడు యుక్త వయసు అయినా వారిలో కనిపిస్తున్నాయి.

 Instead Of Regular Salt In Curries.. Try Using It. Amazing Benefits Are Yours..!-TeluguStop.com

అందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.మనం తినే ఆహారం జీవనశైలో ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు లేకపోతే ఏ వంటకం రుచి ఉండదు.అలాంటి ఉప్పు కూడా ఇప్పుడు కల్తీ అయిపోయింది.

Telugu Anaemia, Black Salt, Problems, Tips, Heart Diseases, Heart-Telugu Health

అయోడిన్ ఉన్నది వాడాలో, లేనిది వాడాలో కూడా కన్ఫ్యూజన్ గా మారిపోయింది.మన పెద్దలు కల్లుప్పు వాడేవారు.కాబట్టి వాళ్లకు నొప్పులు పరంగా ఇబ్బందులు వచ్చేవి కాదు.ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి.అంటే వైద్యులు కూడా కొన్ని రకాల ఆయుర్వేద ఉప్పును వాడాలని చెబుతున్నారు.పింక్, బ్లాక్ సాల్ట్ ఇలా రకరకాల ఉప్పును తయారు చేస్తున్నారు.

సాధారణ ఉప్పు కంటే నల్ల ఉప్పు( Black Salt )ను ఆహారంలో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇది ప్రత్యేకంగా విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Telugu Anaemia, Black Salt, Problems, Tips, Heart Diseases, Heart-Telugu Health

సాధారణంగా కూరల్లో ఉప్పును ఎలా వేస్తామో, దానికి బదులుగా నల్ల ఉప్పును వేస్తే చాలు.ఈ ఉప్పును వాడితే జీర్ణ సమస్యలు( Digestive Problems ) దూరం అయిపోతాయి.కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది.కండరాల నొప్పులు, గుండెల్లో మంట కాలి పిక్కలు పట్టేయడం వంటి సమస్యలను కూడా నల్ల ఉప్పు తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు ఉన్నవారికి నల్ల ఉప్పు మంచి ఔషధంగా పనిచేస్తుంది.దీని వల్ల రక్తం పల్చబడటంతో పాటు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గిపోతుంది.నల్ల ఉప్పును రోజు తీసుకునే ఆహారంలో కలిపి తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు సైనస్, దగ్గు, జలుబు ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube