”భోళా శంకర్( Bhola Shankar )” కు సమయం ఆసన్నం అయ్యింది.మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ సంక్రాంతి సీజన్ లో మూవీ రిలీజ్ చేసి బోణీ చేసారు.
ఇక ఇప్పుడు ఈ ఏడాది రెండవ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు.

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్”.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.రీమేక్ సినిమా అని మొదట్లో కొద్దిగా హర్ట్ అయిన మళ్ళీ ఈ సినిమా ఒక్కో అప్డేట్ వస్తున్న తర్వాత నుండి అంచనాలు పెరిగాయి.
దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు.

ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ లభించాయి.దీంతో ఈ సినిమాపై ప్రస్తుతం డీసెంట్ బజ్ అయితే నెలకొంది.ఇక మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.”రేజ్ ఆఫ్ భోళా( Rage Of Bholaa )” అనే మ్యూజికల్ అప్డేట్ ను ఇచ్చారు.ఇది భోళా శంకర్ థీమ్ సాంగ్ లా అనిపించింది.
మరి ఈ సాంగ్ ను అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేసారు.కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
కీర్తి సురేష్( Keerthy Suresh _ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.మరి రిలీజ్ తర్వాత ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.







