తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.
ఈ క్రమంలో నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపిస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.అనంతరం నాయకులను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ లోకి తరలించారు.
అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతిపై క్లారిటీ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.







