గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముష్టి పెల్లి గీత కార్మికుడు 21-04-2023 రోజున కోమిరే బాబు గౌడ్ రోజు వారి వృత్తి పనిలో భాగంగా తాటి వనానికి వెళ్లి కల్లు గీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి.ఈ మధ్యనే కోలుకున్న బాదితుడిని ఈరోజు మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు మరియు

 Leaders Of Sarvai Papanna Mokudebba Gowda Welfare Association Visited The Injure-TeluguStop.com

సిరిసిల్ల పట్టణ 24వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర లక్ష్మీ శంకరయ్య , బారసా మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లిఖార్జున్ గౌడ్ లు పరామర్శించినారు.

బాధితునికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ తీగల శ్రావణ్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల మురళి మోహన్ గౌడ్ లు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube