తెలంగాణలో తన రాజకీయ అదృష్టం పరీక్షించుకునేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు వైఎస్ షర్మిల( YS Sharmila ).ఇప్పటికే పార్టీని బలోపేతం చేసే విషయంలోనూ ఇతర పార్టీలలోని కీలక నేతలను చేర్చుకునే విషయంలో షర్మిల బాగా వెనకబడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిలో ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో షర్మిల తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపుతారా లేక పూర్తిగా ఎన్నికలకు దూరమవుతారా అనేది చర్చనీయాంశం గా మారింది.
పార్టీ స్థాపించిన మొదట్లో షర్మిల దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు.మీడియా మద్దతు ఆమెకు పూర్తిగా లభించేది.
ఇక పార్టీలోను మొదట్లో చేరికలు కనిపించాయి.

ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కోనేత బయటకు వెళ్లడం, పార్టీ నుంచి బయటకు వెళ్లే వారే తప్ప వచ్చి చేరే వారు కనిపించకపోవడం తదితర కారణాలతో రాజకీయంగా షర్మిల ఇబ్బందులకు గురవుతున్నారు.దీంతో ఇదేవిధంగా ముందుకు వెళ్తే పరిస్థితి కష్టమని భావించిన ఆమె కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకు వచ్చారు.అయితే షర్మిలను చేర్చుకునేందుకు మొదట్లో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మొగ్గు చూపించినా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల రాకను వ్యతిరేకించడం , బహిరంగంగానే ఈ విషయంలో ప్రకటనలు చేయడం తదితర కారణాలతో కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ అయిపోయింది.
అంతేకాదు వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party )ని కాంగ్రెస్ లో విలీనం చేయాలని , అలా చేస్తే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తామనే షరతులు కూడా విధించారు.అయితే పూర్తిగా తాను తెలంగాణ వాదిని అని, తాను తెలంగాణలో పుట్టి పెరిగానని, తెలంగాణ కోడల్ని అని గతంలో అనేక ప్రకటనలు చేయడం తనకు ఏపీతో సంబంధం లేదని, పూర్తిగా తెలంగాణతోనే సంబంధాలు ఉన్నాయంటూ షర్మిల చేసిన ప్రకటనలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి.

ఇక మొదట్లో కేసీఆర్( CM KCR ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్న షర్మిల బిజెపికి దగ్గరైనట్లుగా వ్యవహరించారు.బిజెపి, బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్న సమయంలో కూడా బీ ను షర్మిల టార్గెట్ చేసుకున్నారు.దీంతో బిజెపి తో సన్నిహితంగా మెలుగుతున్నారనే విమర్శలు వచ్చాయి.అయితే ఇటీవల కాలంలో బిజెపి, బీఆర్ఎస్ అగ్ర నేతల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని, అప్పటి నుంచి అంతర్గతం గా ఆ రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దీంతో షర్మిల అటు బిజెపికి దగ్గర కాలేక, ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.పోనీ సొంత పార్టీ ద్వారానే ఎన్నికలకు వెళ్దాం అంటే ఏ నియోజకవర్గంలోనూ పూర్తిగా పట్టు లేకపోవడం, ఎన్నికలకు వెళ్లినా అభాసుపాలు అవ్వడం తప్ప , ఫలితం ఉండదు అనే సంకేతాలు వెలబడుతుండడంతో, షర్మిల రాజకీయంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారట.







