ఇండియన్ సినిమా అంటే ఎలా ఉండాలని 90 వ దశకం లోనే సినిమాలు తీసి చూపించిన డైరెక్టర్ మణిరత్నం…( Director Maniratnam ) ఆయన తీసిన సినిమాల్లో చాలా సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి అందులో నాయకుడు, దళపతి లాంటి సినిమాలు మాత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా పెద్ద విజయాన్ని సాధించాయి నిజానికి ఈ సినిమా లు తెలుగు హీరోలతోనే చేయాల్సింది
కానీ మన హీరోలు ఇలా మల్టీ స్టారర్ సినిమాలో చేస్తే ఇమేజ్ పోతుందేమో అని చేయలేదు కాని ఆయన కమల్, రజిని లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి టాప్ డైరక్టర్ గా ఎదిగాడు ఇక ఆ తర్వాత ఆయన బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ తో( Shahrukh Khan ) దిల్ సే అనే సినిమా తీశాడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది… ఇక వీటి తో పాటు రోజా,( Roja ) సఖి( Sakhi ) లాంటి సినిమాలు కూడా సూపర్ డుపర్ హిట్ అయ్యాయి…

అయితే అప్పట్లో మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కూడా సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు గా పేర్లు తెచ్చుకున్నారు.తమిళ్ నుంచి ఆయన, తెలుగు నుంచి ఈయన ఇద్దరు కూడా మంచి డైరెక్టర్లు గా పేరు సంపాదించుకున్నారు…

ఇక వీళ్ళు తీసిన సినిమాలకి అప్పట్లో ఫ్యాన్స్ చాలా మంది ఉండేవాళ్ళు అలాగే వీళ్ళు ఏ సినిమా చేస్తారా అని హీరోలు కూడా వాళ్ల కోసం వెయిట్ చేసేవారు.ఇక కొత్తగా డైరెక్టర్ అవుదాం అని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లు సైతం వల్ల దగ్గర పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో వాళ్ల క్రేజ్ ఎలా ఉండేదో…ఇక ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు…
.







