ఆమె బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. ప్రభాస్ చేత ప్రశంసలు పొందిన ఆ నటి ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Rebel Star Prabhas ) ఎంతో టాలెంట్ ఉంటే తప్ప అవతలి వ్యక్తులను ప్రశంసించడానికి ఇష్టపడరు.తాజాగా దీపికా పదుకొనే గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

 Prabhas Shocking Comments About Deepika Details Here Goes Viral In Social Media,-TeluguStop.com

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే కనిపించనున్న సంగతి తెలిసిందే.అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ దీపికా పదుకొనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అన్నారు.

Telugu Biggest, Kalki, Nag Ashwin, Prabhas, Project, Tollywood-Movie

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Heroine Deepika Padukone ) అద్భుతమైన నటి అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.చూడటానికి దీపికా పదుకొణే చాలా అందంగా కనిపిస్తారని ప్రభాస్ కామెంట్లు చేశారు.దీపిక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిందని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.దీపికా పదుకొనే కల్కి మూవీ సెట్ లో అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలో ఉత్సాహం వస్తుందని స్టార్ హీరో ప్రభాస్ కామెంట్లు చేయడం గమనార్హం.

దీపికా పదుకొనేతో కలిసి నటించాలని ఉందని ఎప్పటినుంచో అనుకుంటున్నానని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.దీపికతో కలిసి నటించడం ఇప్పటికి కుదిరిందని ఆయన పేర్కొన్నారు.

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా( Project K Movie )పై అకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో అభిమానులను మెప్పించే అంశాలు ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Biggest, Kalki, Nag Ashwin, Prabhas, Project, Tollywood-Movie

అశ్వనీదత్( Producer Ashwinidutt ) నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రాజెక్ట్ కే మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిసుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్ట్ కే మూవీ సంచలనాలను సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.ప్రభాస్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ప్రభాస్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube