అధికార పార్టీ తీరుపై టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడు ధ్వజమెత్తారు.ప్రభుత్వ స్థలాలను దగ్గరుండి ప్రభుత్వ అధికారులే కబ్జా చేయిస్తున్నారని మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ పరిధిలో మూలపెట పోర్టు నిర్మాణం పేరుతో నాయకులు సొమ్ముచేసుకుంటున్నారంటూ ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ వైకాపా పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ స్థలాలు కళ్ల ఎదుటే ఆక్రమణలకు గురి అవుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం మానేసి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వం లో నేను కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి అవుతున్నాయని, తక్షణమే ఆపకుంటే ప్రజాగ్రహానికి గురి కావల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్థలాల ను అమాయక ప్రజలు ఎవ్వరు కొనుక్కోవద్దని.ఒకవేళ కొన్నా భవిష్యత్ లో మా పార్టీ అధికారం లోకి రాగానే ఆక్రమణలు తొలగించడం పైనే నా మొదటి ద్రుష్టి పెడతాని హెచ్చరించారు.
అలాగే మూల పేట పోర్టు నిర్మాణం లో అనేక లొసుగులు ఉన్నాయని ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా పోర్టు నిర్మాణం జరపాలని ప్రయత్నం మొదలు పెట్టిందే నేను అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.