తాజాగా ఒక నటి నిర్మాతపై సంచలన వాఖ్యలు చేసింది.ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే.ఓడియాకి చెందిన నటి శీతల్( Actress Sheetal ) పాత్ర తన ప్రైవేట్ వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ నిర్మాత దయానిధి దహిమాపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అసలు వ్యవహారం బయటపడింది.ప్రారంభంలో నిర్మాత దయానిధి దహిమా( Produced by Dayanidhi Dahima ), నటి శీతల్ పాత్ర మధ్య మంచి అనుబంధం ఉంది.
కలిసి పనిచేయడంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.అది కాస్తా ఫిజికల్ రిలేషన్ షిప్ వరకు వెళ్లింది.
అప్పటి వరకు బాగానే ఉంది.కానీ ఆమె ఇతర మేకర్స్ తో పనిచేయాలని నిర్ణయించుకుంది.

దాంతో వారిద్దరి మధ్య చెడింది.అది కాస్త గొడవల వరకు దారి తీసింది.ఈ ఏడాది మార్చిలో తాను ఆ విషయం పై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.ఇందులో సైబర్ బెదిరింపులు, నకిలీ వార్తాలను సృష్టించడం నేరం, అనేక నకిలీ ఖాతాలను సృష్టించడం దయా ఎంటర్టైన్‌మెంట్స్ కి చెందిన దయానిధి దహిమా నకిలీ వార్తలను సృష్టించాడని ఒప్పుకున్నాడు.
ఇది చాలా మందికి వినోదంగా ఉన్నప్పటికీ ఏ మహిళకైనా ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి.ఆర్టిస్టులు అందరూ మహిళలందరూ తదుపరి ఎవరితో పనిచేస్తారో, ఏ విధంగా సహకరిస్తారో జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను.
మహిళలకు అండగా నిలిచినందుకు ఒడిసా పోలీస్, సైబర్ పోలీస్( Odisha Police, Cyber Police ) లకు, డీసీపీకి ఆమె ధన్యవాదాలు తెలిపింది.ఈ క్రమంలో ఇప్పుడు ఆయనపై పోలీస్ కేసు పెట్టింది.
జులై 28న భువనేశ్వర్‌లోని లక్ష్మి సాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది శీతల్.

దయానిధి తనను లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది.తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తనకు ఇచ్చిన పారితోషికం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది.అతను తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు వెల్లడించింది.
తన ప్రతిష్టని దిగజార్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని, తన ఫ్యామిలీని కూడా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొంది.అదే సమయంలో తాను గత కొన్నేళ్లుగా నిర్మాతతో సహజీవనం చేసినట్టు తెలిపింది.
అందుకే తనని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తుంది.







