వైసీపీకి, ఆ పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ ఫోబియో పట్టుకుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు.జగన్ పై సినిమా తీయాలనే ఆలోచన ఉంది కానీ బడ్జెట్ లేదన్నారు.
ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.బయట డైరెక్టర్ ను పెట్టి వెబ్ సిరీస్ తీస్తామన్న ఆయన వైసీపీలో ఉన్న నేతలు ట్రై చేసుకోవచ్చని వెల్లడించారు.
అయితే బ్రో సినిమా పంచాయతీ ఏపీలో రాజుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో జనసేన వర్సెస్ మంత్రి అంబటి మధ్య గత రెండు, మూడు రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.







