రెబా మోనికా జాన్( Reba Monica John ) తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నటి.ఆమె తెలుగులో ఒకే సినిమాతో పాపులర్ అయింది, అదే ‘సామజవరగమన’.
అయితే, ఆమెకు ముందుగానే తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.మొదటి అవకాశం నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’( Jersey ) సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం.
అయితే, రెబాకు కాల్ షీట్లు కుదరకపోవడంతో ఆమె ఈ సినిమాను ఒప్పుకోలేదు.దాంతో ఈ సినిమాలో శ్రద్ధా శ్రీకాంత్ హీరోయిన్ పాత్ర పోషించింది.
రెండవ అవకాశం సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోగా వచ్చిన ‘బ్రో’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలుగా నటించే అవకాశం.ముందుగా రెబాను ఇంటర్వ్యూకు పిలిచారట.
అయితే, ఆ క్యారెక్టర్ కు రెబా సూట్ కాకపోవడంతో ఆమెకు సినిమా ఇవ్వలేదు.ఈ రెండు అవకాశాలు వదులుకోవడంతో రెబాకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉండదని భావించింది.
అయితే, ఆమె ఒక రోజు తన స్నేహితురాలితో కలిసి ఓ సినిమా షూటింగ్ కు వెళ్లింది.అక్కడ శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ( Samajavaragamana )సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం నటిని వెతుకుతున్నారు.రెబాను షూటింగ్ లో చూసి డైరెక్టర్ ఫిదా ఆయ్యాడట.అందుకే ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశాడు.ప్రచారం ప్రకారం, సామజవరగమన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, చిత్రబృందం రెబాతో సెల్ఫీ దిగడానికి వచ్చారు.అప్పుడు నేను మీకు తెలుసా అని ఆ ముద్దుగుమ్మ అడిగిందట.తెలుసు, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఇవ్వాలనుకుంటున్నామని చిత్ర బృందం చెప్పడంతో ఆమె సర్‌ప్రైజ్ అయ్యిందట.“మాకు కూడా అవకాశాలు వస్తాయా తెలుగులో” అని అనేసరికి చిత్ర బృందం నవ్వేసిందట.

‘సామజవరగమన’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.రెబా మోనికా తెలుగులో పాపులర్ అయింది.ఆమె ఇప్పుడు తెలుగులోనే సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతుంది.
ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆహరణాల అచ్చ తెలుగు అమ్మాయిలనే ఉంటుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆదరించే అవకాశం ఉంది.మంచి హిట్ పడాలే కానీ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ రేంజ్ కి కూడా వెళ్ళిపోతుందని అనడంలో సందేహం లేదు.







