అల్లు అర్జున్( Allu arjun ) హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.రికార్డు స్థాయి వసూళ్ల ను మొదటి పార్ట్ దక్కించుకున్న నేపథ్యం లో రెండవ పార్ట్ ను అంతకు మించి అన్నట్లుగా రూపొందిస్తున్నారు.
కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేయడం తో పాటు ఇతర నాన్ బాహుబలి రికార్డు లను సైతం బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా ఉన్నారు.అందుకు తగ్గట్లుగానే పుష్ప 2 ను మేకింగ్ చేస్తున్నారు.
ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు అవ్వాలి అంటే అన్ని భాషలకు సంబంధిచిన వారు కూడా సినిమా లో ఉండాల్సిన అవసరం ఉంది.అందుకు తగ్గట్లుగానే ఎంతో మంది నటీ నటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు.అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్స్ ను నటింపజేస్తున్నారు.
తమిళ్, మలయాళం నటీ నటులు కూడా ఈ సినిమా లో కనిపించబోతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ఏఐ క్యారెక్టర్ ను కూడా ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని మేకర్స్ తో పాటు చాలా మంది చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటి వరకు తెలుగు సినిమా ల్లో అలాంటిది ఏమీ ప్రయత్నించలేదు.మొదటి సారి పుష్ప 2 కోసం ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.మొత్తానికి పుష్ప 2( Pushpa 2 ) సినిమా ను ఒక ప్రయోగ శాల అన్నట్లుగా మార్చేశారు.
ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే విధంగా పుష్ప 2 ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు.ఒక వేళ ఆర్టిఫిషల్ క్యారెక్టర్ కనుక సక్సెస్ అయితే చిన్న సినిమా ల్లో కూడా ఆ ప్రయోగం రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సుకుమార్ ఏం చేసినా కూడా కన్విన్సింగ్ గా ఉంటుంది.కనుక పుష్ప 2 లో ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్( Artificial Intelligence ) పాత్ర కూడా తప్పకుండా ఆకట్టుకుంటుంది అని ఆయన అభిమానుల నమ్మకం.







