పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ బ్రో సినిమాలో రాజకీయ వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్లో మాటల మంటలు రేగుతున్నాయి .భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati rambabu) ను పోలిన పాత్రను బ్రో సినిమాలో పెట్టారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి .
తనను గురించి పాత్రలు పెట్టుకొకపోతే పవన్కు సినిమా భవిష్యత్తు లేదంటూ అంబటి ఇప్పటికే విమర్శలు చేశారు.అయితే ఈ పాత్ర పై జనసేన నుంచి పడుతున్న సెటైర్ల నేపద్యం లో ఆయన ఆగ్రహం మరింత పెరిగినట్టుగా తెలుస్తుంది .అందుకే కీలక శాఖకు మంత్రి అయ్యుండి ఒక సినిమా ఫలితాన్ని దాన్ని లెక్కలను వివరించడానికి ఆయన మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై విమర్శలు కురిపించారు .

బ్రో సినిమా( Bro movioe ) కలెక్షన్స్ లేక తేలిపోయింది అని తన పాత్ర వల్లే అంతో ఇంతో ఆడింది అని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై తాను కూడా సినిమా తీస్తామని దానికి నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్లు పెటాకులు, తాళి -ఎగతాళి, మూడు పెళ్లిళ్లు ఆరు పేటాకులు లాంటి టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు.నిజానికి బ్రో సినిమాల్లో ఆ పాత్ర పరిధి రెండు నిమిషాలు కూడా
ఉండదు .ఆ పాత్ర కూడా కేవలం ఒకప్పుడు మంత్రిగారు సంక్రాంతి సందర్భంగా జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాల్లో చేసిన డ్యాన్సును పోలి ఉంటుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంబటి రాంబాబు పై ఈ పాత్రపై భారీ ట్రోలింగ్ జరగటం వల్లే ఆయన హర్ట్ అయినట్లుగా తెలుస్తుంది .అందుకే మంత్రి హోదాలో ఉండి కూడా ఈ సినిమాపై విమర్శలు చేయడానికి ఆయన ప్రెస్మీట్లు కూడా పెడుతున్నారు .అయితే సినిమాను సినిమాగా తీసుకోవాలని ఎవరిని ఉద్దేశించి మేము పాత్రలు పెట్టలేదంటూ సినిమా బృందం సమర్ధించుకుంటుండగా రాజకీయ క్షేత్రంలో తమను ఏమీ చేయలేని పవన్ ఇలా తన సినిమాలలో మమ్మల్ని ట్రోల్ చేసుకుంటూ డబ్బు చేసుకుంటున్నారు అంటూ వైసీపీ శ్రేణులు( YCP ) ఎద్దేవా చేస్తున్నాయి .ఏది ఏమైనా ఎన్నికలు దగ్గరగా వస్తున్నందున ప్రతి అంశము కాదేది రాజకీయాని కనర్హం అన్నట్టుగా వివాదాస్పదంగా మారిపోతుండటంగమనార్హం .