సూపర్ స్టార్ రజినికాంత్( Rajinikanth ) సినిమా అంటే సౌత్ సినీ పరిశ్రమలో ఆ హంగా వేరేలా ఉంటుంది.కోలీవుడ్ లో రజిని సినిమాలకు ఉండే డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే.
అక్కడే కాదు తెలుగులో కూడా ఇక్కడ స్టార్స్ కి ఈక్వల్ గా రజిని సినిమాలు సందడి చేశాయి.రజినికి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే రజిని సినిమాలు ఈమధ్య తెలుగులో పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు.చూస్తూ చూస్తూనే సూపర్ స్టార్ గ్రాఫ్ పడిపోయింది.
ఈ క్రమంలో రజినికాంత్ సినిమాలకు తెలుగులో డిమాండ్ తగ్గిపోయింది.
ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజిని చేస్తున్న జైలర్ సినిమాకు( Jailer Movie ) తెలుగులో ఎలాంటి బజ్ లేదు.అంతేకాదు ఈ సినిమా బిజినెస్ కూడా మొన్నటిదాకా జరగలేదన్నట్టు తెలిసింది.జైలర్ నిర్మాతలు 12, 15 కోట్ల దాకా తెలుగు రైట్స్( Telugu Rights ) డిమాండ్ చేస్తుంటే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 5, 6 అన్నట్టుగా చెబుతున్నారట.
మరి ఇంతకీ జైలర్ సినిమా బేరం తెగిందా లేదా తమిళ నిర్మాతలే ప్రాఫిట్స్ అండ్ లాస్ బేస్ మీద తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తారా అన్నది చూడాలి.రజినితో పాటుగా ఈ సినిమాలో తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంది.
సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించాడు.