పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.బాహుబలి తర్వాత మళ్ళీ మరో హిట్ అందుకోక పోయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.
ఇటీవలే ఆదిపురుష్ వంటి భారీ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకుని కాస్త వెనక్కి తగ్గాడు అనుకునే లోపే మళ్ళీ కల్కి వంటి సినిమాతో సమీకరణాలు మొత్తం మార్చేశాడు.
కల్కి( Kalki 2898 AD ) పాన్ వరల్డ్ సినిమా కావడం ఈ టైటిల్ ను ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ప్రకటించడంతో ఒక్కసారిగా డార్లింగ్ పేరు మారుమోగి పోయింది.
ఇక అంతకంటే ముందే సలార్( Salaar ) సినిమాతో సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సెప్టెంబర్ 28న సలార్ గ్రాండ్ రిలీజ్ కానుంది.ఆ వెంటనే కొన్ని నెలల గ్యాప్ తో 2024 సంక్రాంతి కానుకగా కల్కి రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.ప్రభాస్ ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన కోసం ఇంకా క్యూ కట్టేవారు చాలా మంది ఉన్నారు.తాజాగా ఈయన కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers) ఈ కాంబోను తెరపైకి తీసుకు రానుందట.మైత్రి ప్రభాస్ తో ఎప్పుడు సినిమా ప్లాన్ చేసి సిద్ధార్థ్ ఆనంద్ ను డైరెక్టర్ గా అనుకున్నారు.కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ కోసం ఎదురు చూడకుండా లోకేష్ తో ప్రభాస్ మూవీ ఫిక్స్ చేసారని టాక్ వైరల్ అయ్యింది.చూడాలి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అఫిషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో.








