తాజాగా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్( x ) విడుదల చేసింది.ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.పీవో/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2023 ఆగస్టు 21 గా నిర్ణయించారు.
ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్/ అక్టోబరు నెలలో నిర్వహించనున్నారు.మెయిన్ పరీక్ష నవంబర్ లో నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ 2024 జనవరి/ ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు.స్పెషలిస్ట్ ఆఫీసర్( Specialist Officer) పోస్టుల ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 2023 ఆగస్టు 21 గా నిర్ణయించారు.
పిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2023 లో ఉంటుంది.మెయిన్ పరీక్ష జనవరి 2024 లో ఉంటుంది.
ఇంటర్వ్యూ ఫిబ్రవరి/ మార్చి 2024 లో ఉంటుంది.

ఎంపిక విధానం:
పిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ముందుగా ప్రిలిమినరీ పరీక్ష( Preliminary Examination )లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు.మెయిన్ పరీక్షకు అర్హతలో సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ కు వెళ్తారు.
ప్రిలిమినరీ పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు.ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు ఉంటాయి.

మెయిన్స్ పరీక్ష 200+25 మార్కులకు నిర్వహిస్తారు.ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్కులు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ 60 మార్కులు, డేటా అనాలసిస్ ఇంటర్ప్రిటిషన్ 60 మార్కులు, జనరల్ ఎకనామి బ్యాంకింగ్ అవేర్నెస్ 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( లెటర్ రైటింగ్ ఎస్సే)25 మార్కులకు నిర్వహిస్తారు.ఇక ఫైనల్ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.







