అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి( DSP Uday Reddy ) పర్యవేక్షణలో జిల్లా పరిధిలోని తంగాల్లపల్లి మండల పరిధిలోని సారంపల్లి గ్రామంలో మునిగెల అంజయ్య అనే వ్యక్తి అక్రమ అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నడని నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్ల రూరల్ సి.ఐ సదన్ కుమార్, ఎస్.

 Police Raids On Illegal Moneylenders , Police Raids , Dsp Uday Reddy-TeluguStop.com

ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది తో కలసి సోమవారం రోజున సాయంత్రం దాడులు జరిపి అంజయ్య ఇంట్లో ప్రాంసరి నోట్స్,బాండ్ పేపర్స్,వాహనాలు,సాధబైనమా పేపర్స్, బుక్స్, నగదు స్వాధీనం చేసుకొని అంజయ్య ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ సి.ఐ మంగళవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం స్వాధీనపరుచుకున్న వాటి వివరాలు,10 బాండ్ పేపర్స్ వర్త్ రూపాయలు 20,72,064/-, 8 ప్రంసరి నోట్స్ వర్త్ రూపాయలు 4,61,000/-,21సాధబైనమా పేపర్స్,బుక్స్ వర్త్ రూపాయలు 20,90,300/-,నగదు రూపాయలు 1,50,000/-, ఒక ద్విచక్ర వాహనం, ఒక ట్రాక్టర్ స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సి.ఐ సదన్ కుమార్ మాట్లాడుతూ.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో దాడులు యధాతథంగా కొనసాగుతూనే ఉంటాయి,కాబట్టి ఇకనైనా అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు తమ పద్దతి మార్చుకోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.

అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్బిఐ నియమనిబందనలు, తెలంగాణ మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు.కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఈ టాస్క్ లో సిరిసిల్ల రూరల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్,ఎస్.ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube