సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే టాలెంట్ మాత్రమే సరిపోదు.కొంచెం అదృష్టం కూడా ఉండాలి.
ఆ అదృష్టం ఎప్పుడు ఎవర్ని వరిస్తుందో చెప్పలేం.కొందరు ఒక్క సినిమాతోనే స్టార్లు ఐపోతుంటే, మరికొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
ఇప్పుడు ఈ అదృష్టం హర్యానా భామ మీనాక్షి చౌదరిని వరించినట్టుంది.ఈమెకు ఒక్కసారిగా వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
మీనాక్షి చౌదరి(Meenakshi Chaudharyv ) హర్యానా లోని పంచకులలో 1997లో జన్మించింది.పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీలో డెంటల్ కోర్స్ పూర్తి చేసింది.2018లో మయన్మార్ లోని యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలలో మొదటి రన్నర్ అప్ టైటిల్ గెలుచుకుంది.తరువాత 2018 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ కూడా గెలుచుకుంది.
అదే సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటాన్ని కూడా అందుకుంది.హిందీలో రెండు మ్యూజిక్ వీడియోలు,ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన ఈ భామ, “ఇచట వాహనములు నిలుపరాదు” చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది.
తరువాత రవితేజ సరసన ఖిలాడీ( Khiladi ) చిత్రంలో నటించింది.ఈ రెండు చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
కానీ హిట్ 2 చిత్రంలో ఆమెకు మల్లి అవకాశం వచ్చింది.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది మీనాక్షి.ఈమె ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది.వరుణ్ తేజ్, కరుణ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం “మట్కా“.ఈ సినిమాలో మీనాక్షి వరుణ్ సరసన నటించబోతోంది.ఈ సినిమా షూట్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతోంది.విశ్వక్సేన్ తో కూడా మరొక సినిమా చేస్తోందనే టాక్ నడుస్తోంది.
తాకగా ఈ భామ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సినిమా ఛాన్స్ కొట్టేసిందన్న వార్త వైరల్ అవుతోంది.మహేష్ బాబు, త్రివిక్రమ్ కంబోలో వస్తున్నా “గుంటూరు కరం” చిత్రంలో పూజ హెగ్డే తప్పుకోవడంతో, మీనాక్షిని తీసుకుంటున్నారట.
ఈ విషయాన్నీ ఇంకా చిత్ర యూనిట్ అనౌన్స్ చెయ్యలేదు.ఈ సినిమా లో మీనాక్షి ఫైనల్ ఐతే మహేష్( Mahesh Babu ) తో సినిమా చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ తో పాటు మరిన్ని అవకాశాలు కొట్టేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.