మాళవిక మోహన్( Malavika Mohan ) దక్షిణాది సిని ఇండస్ట్రీలో పలు తమిళ మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం పూర్తి అయింది.
ఈ క్రమంలోనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.మలయాళ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరోగా నటించిన పట్టం బోల సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు అనంతరం తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) హీరోగా నటించిన పేట సినిమా( Peta Movie ) ద్వారా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇక్కడ కూడా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా తమిళ మలయాళ భాషలలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె పా.రంజిత్ దర్శకత్వంలో నటుడు విక్రమ్( Vikram ) నటించిన తంగలాన్ ( Thangalaan ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా మాళవిక మోహన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం పూర్తి అయ్యిందని తెలిపారు.ఇకపై తాను నటించే సినిమాలన్నింటిలోనూ కూడా కథ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు.
ఆ సినిమా 500 కోట్ల కలెక్షన్లను రాబట్టిన నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తానని లేకపోతే నో చెప్పేస్తాను అంటూ నిర్మొహమాటంగా తెలియజేశారు.సినిమా 500 కోట్ల రాబట్టినా నాకు మాత్రం ప్రాధాన్యత లేకపోతే నేను నటించి కూడా లాభం ఉండదని అందుకే కథ ప్రాధాన్యత సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







