ప్రముఖ మైక్రో బ్లాకింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను( Twitter ) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్( Elon Musk ) కొనుగోలు చేసిన తర్వాత అనేక మార్పులు తీసుకొస్తున్నారు.ట్విట్టర్ ఆదాయాన్ని పెంచేందుకు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఎవరైనా సబ్‌స్క్రిప్షన్ చెల్లించి బ్లూటిక్ మార్క్ సొంతం చేసుకునే ఫీచర్ తీసుకురాగా.ఇటీవల ట్విట్టర్ లోగోను మార్చారు.
పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను( X ) ప్రవేశపెట్టారు.ఈ క్రమంలో ట్విట్టర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కంటెంట్ క్రియేటర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది.ఇక నుంచి ట్విట్టర్ లో కూడా కంటెంట్ క్రియేటర్స్ తమ ట్వీట్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
ఇందుకోసం ఒక ప్రోగ్రామ్‌ను ట్విట్టర్ ప్రకటించింది.గడిచిన మూడు నెలల్లో కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండటంతో పాటు కోటి 50 లక్షల ట్వీట్ ఇంప్రెషన్స్ కలిగి ఉండాలి.
ఇంతకుముందు నెల నెలా 50 లక్షలు ఇంప్రెషన్స్ సంపాదించాల్సిందిగా కంపెనీ రూల్ తెచ్చింది.కానీ ఇప్పుడు మూడు నెలల కాలంలో మొత్తంగా చూసుకుంటే ఒక కోటి 50 లక్షలు ఇంప్రెషన్స్ ఉండాలని పేర్కొంది.
దీనివల్ల ఒక నెలలో తక్కువ వచ్చిన ఇంకొక నెలలో కవర్ చేసుకోవచ్చు.అలాగే లక్షల్లో ఫాలోవర్ల సంఖ్య అవసరం లేకుండానే కేవలం 500 మంది ఫాలోవర్లతో రెవిన్యూ సంపాదించడం స్టార్ట్ చేయవచ్చు.

పేమెంట్ వివరాలను సెటప్ చేసుకుని యాడ్ రెవెన్యూ( Ad Revenue ) నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు.అయితే కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా వెరిఫైడ్ అకౌంట్ కలిగి ఉండాలి.అలాగే ఏ కారణంతోనైనా అకౌంట్ సస్పెండ్ అయి ఉండకూడదు.50 డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ట్విట్టర్ రీబ్రాండ్ వెర్షన్ ఎక్స్ ఫ్లాట్ ఫామ్ జులై 31 నుంచి పేమెంట్ అందుకుంటారు.పేమెంట్స్ కోసం స్ట్రెయిస్ అకౌంట్ అవసరం.

అర్హత ఉన్న వినియోగదారులు ఇందులో చేరవచ్చని ట్విట్టర్ స్పష్టం చేసింది.అయితే యాడ్స్ రెవెన్యూ షేరింగ్ నిబంధనలు, క్రియేటర్స్ మానిటైజేషన్( Monetization ) ప్రమాణాలను ఉల్లంఘిస్తే యాడ్ రెవెన్యూ రాకుండా బ్యాన్ చేస్తామని తెలిపింది.అయితే వివిధ కారణాల వల్ల యాడ్ రెవెన్యూను రద్దు చేసే అవకాశం కూడా కంటెంట్ క్రియేటర్స్ కి ఉంటుంది.
ఇటీవలే ఈ ప్రొగ్రాంను ప్రారంభించగా.ఇప్పటికే పలువురికి చెల్లింపులు చేసింది.
ట్విట్టర్‌లో వచ్చే ఇంప్రెషన్ల ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయి.







